గత వారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ పర్హాట్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇక గత సోమవారం నాడు ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తో పాటు మరో నలుగురు సపోర్ట్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. దీనిపై అటు బీసీసీఐ ఇటు ఢిల్లీ మేనేజ్ మెంట్ మొదట్లో గోప్యత వ్యవహరించినా చివరకు వార్త బయటకు వచ్చింది. దాంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
ఇక జట్టులో కరోనా కేసులు రావడంతో మిగతా జట్టు సభ్యలకు కూడా భయం పట్టుకుంది. గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు జట్టు సభ్యులకు నాలుగు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అయితే అందరికి కూడా నెగెటివ్ ఫలితాలే వచ్చాయి. ఇటువంటి సమయంలో మ్యాచ్ కోసం పుణే వరకు బస్సులో ప్రయాణించడం మంచిది కాదనే ఉద్దేశంతో పంజాబ్ తో జరిగే మ్యాచ్ ను బ్రబోర్న్ కు బీసీసీఐ మార్చింది. (IPL Twitter)