ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచులు ఆడి.. ఐదింట్లో నెగ్గి.. 4 మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆరెంజ్ ఆర్మీకి మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటం ప్లస్ పాయింట్.