[caption id="attachment_1276926" align="alignnone" width="1600"] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అంపైర్లు తమ పాత్రలకు న్యాయం చేయలేకపోతున్నారు. అటు ఆన్ ఫీల్డ్, ఇటు థర్డ్ అంపైర్లు చెత్త నిర్ణయాలతో ఫ్యాన్స్ చేత చివాట్లు తింటున్నారు. సీజన్ లో ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్ లు పూర్తి కాగా.. లెక్కలేనన్ని తప్పుడు నిర్ణయాలతో మ్యాచ్ లపై ఇంట్రెస్ట్ తగ్గించేలా చేస్తున్నారు.
అంపైరింగ్ విషయాల్లో కొన్ని సార్లు తప్పులు జరగడం సహజం. ముఖ్యంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ల విషయంలో ఎందుకంటే వీరు కూడా మనలానే రియల్ టైమ్ లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే ఇలా జరగకూడదనే DRSను ఇంట్రడ్యూస్ చేశారు. అంతే కాకుండా ఈసారి ఐపీఎల్ లో ఒక్కో జట్టుకు ఇన్నింగ్స్ కు రెండు సార్లు DRS తీసుకునేలా వెసులు బాటు కల్పించారు.
రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగ్గా.. ఛేజింగ్ లో హైదరాబాద్ ఓపెనర్ విలియమ్సన్ క్యాచ్ విషయంలో తొలిసారి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడు. విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ను పడిక్కల్ అందుకోగా.. బంతి అతడి చేతుల్లోకి వెళ్లడం కంటే ముందే గ్రౌండ్ ను తాకింది. థర్డ్ అంపైర్ రీప్లేలో పలుమార్లు చూసి అవుట్ గా ప్రకటిస్తూ తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. (PC : TWITTER)
రెండో తప్పుడు నిర్ణయం కూడా విలియమ్సన్ విషయంలోనే వచ్చింది. లక్నో తో జరిగిన మ్యాచ్ లో విలియమ్సన్ పవర్ ప్లేలో అవుటయ్యాడు. అయితే ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ బయట ఉన్నారు. పవర్ ప్లే అయిన 1 నుంచి 6 ఓవర్ల మధ్య ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండాలి. వాస్తవానికి విలియమ్సన్ అవుటైన బంతిని నో బాల్ గా ప్రకటించాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. (PC : TWITTER)
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. బ్రేవిస్ వేసిన బంతిని కోహ్లీ డిఫెన్స్ ఆడగా.. బంతి ప్యాడ్లకు తగిలిందనే ఉద్దేశంతో ముంబై ప్లేయర్ అప్పీల్ చేశాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించగా.. కోహ్లీ DRSకు వెళ్లాడు. అక్కడ బంతి ఒకేసారి బ్యాట్, ప్యాడ్ కు తగిలినట్లు కనిపించింది. ఇటువంటి సమయాల్లో బ్యాట్ కు ముందుగా తగిలిందని భావించాలని నిబంధనల్లో ఉంది. కానీ థర్డ్ అంపైర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడి అవుట్ గా ప్రకటించాడు. దీనిపై కోహ్లీ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడు. (PC : TWITTER)
ఐపీఎల్ చరిత్రలోనే అంపైర్ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదే. హేజల్ వుడ్ వేసిన బంతి వైడ్ లైన్ ను దాటి చాలా దూరంగా వెళ్లినా అంపైర్ క్రిస్ గఫానీ మాత్రం వైడ్ గ్రా ప్రకటించలేదు. దీనిపై స్టొయినిస్ నవ్వుతూ కళ్లు బాగానే పని చేస్తున్నాయా అన్నట్లు ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చాడు. అయితే అనంతరం అతడు బౌల్డ్ అవ్వగా.. అంపైర్ ను బండ బూతులు తిడుతూ అతడు మైదానాన్ని వదిలాడు. (PC : TWITTER)
ఇదేమో శుక్రవారం జరిగిన మ్యాచ్ ది. రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ జరగ్గా.. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయం కోసం 36 పరుగులు చేయాలి. తొలి మూడు బంతులకు పావెల్ సిక్సర్లు బాదాడు. అయితే మూడు బంతి ఫుల్ టాస్ కాగా.. అది నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చింది. వాస్తవానికి దానిని నో బాల్ గా ప్రకటించాలి. కానీ అంపైర్లు అలా చేయలేదు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ప్లేయర్స్ ను డగౌట్ కు పిలిచాడు కూడా. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోవడం విశేషం. (PC : TWITTER)