ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆఖరి దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ లో ఇంకో రెండు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. ఆదివారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగే మ్యాచ్ తో లీగ్ దశ ఎండ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. ఒక ప్లేస్ కోసం మాజీ ఫైనలిస్టులో రేసులో ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు అదరగొట్టాయి. వీటితో పాటు తొలి ఐపీఎల్ ఎడిషన్ (2008) విన్నర్ రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) కూడా లీగ్ స్టేజ్ లో సత్తా చాటి ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. (IPL Twitter)
అయితే చివరి స్థానం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు పోటీ పడుతున్నాయి. గురువారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ పై నెగ్గిన ఆర్సీబీ 16 పాయింట్లతో ప్రస్తుతానికి నాలుగో స్తానంలో కూర్చొని ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
దాంతో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు ఎలాగైనా ముంబై గెలవాలని కోరుకుంటున్నారు. ప్లీజ్ రోహిత్ ప్లీజ్ రోహిత్ అంటూ ముంబైని గెలిపించు అంటూ ప్రాధేయపడుతున్నారు. ఆర్సీబీ కంటే కూడా ఢిల్లీ జట్టు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. దాంతో నేటి పోరులో ఢిల్లీ జట్టు ఒక్క పరుగు లేదా ఒక్క వికెట్ లేదా సూపర్ ఓవర్ లో నెగ్గితే చాలు.