ఐదు సార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్లో మాత్రం తేలిపోయింది. చెత్త ఆటతీరుతో సొంత ఫ్యాన్స్ చేతే చివాట్లు తింటోంది. ఇప్పటి వరకు లీగ్ లో 13 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింటిలో మాత్రమే గెలిచి మరో 10 మ్యాచ్ ల్లో ఓడింది. దాంతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.
2023 సీజన్ కోసం బెంచ్ ను పరీక్షిస్తున్నట్లు.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామన్ని మాటలపై రోహిత్ నిలబడితే ఢిల్లీ తో జరిగే మ్యాచ్ ద్వారా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో డెబ్యూ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ముంబై ఫ్యాన్స్ కూడా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీపై ఆసక్తి కనబరుస్తున్నారు. సోకీన్, కుమర్ కార్తికేయ సింగ్ లాంటి ప్లేయర్స్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసినా కూడా అర్జున్ టెండూల్కర్ ను ఒక్క మ్యాచ్ లో కూడా తీసుకోకపోవడంతో సచిన్ అభిమానులు ముంబై జట్టుపై ఆగ్రహంతో ఉన్నారు.