డేవిడ్ వార్నర్ (David Warner).. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) లో అత్యంత నిలకడైన విదేశీ ప్లేయర్. ఇండియన్ ప్లేయర్స్ సొంత మైదానంలో ఆడినట్లే డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో తన బ్యాట్ పదును ఏంటో చూపాడు. ఈ ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున అత్యధికంగా 432 పరుగులు చేశాడు. (Instagram)
ఐపీఎల్ 2022లో వార్నర్ బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించలేకపోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో టోర్నీ నుంచి ఢిల్లీ నిష్క్రమించింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ వార్నర్ కు ఇంట్లో ఆశించిన స్థాయిలో స్వాగతం లభించలేదు.
తాను బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి దిగిన ప్రతీసారీ- సెంచరీ చేయాలని కుమార్తెలు కోరుకుంటారని చెప్పాడు. సెంచరీ చేయలేకపోతే తనను నిలదీస్తారని చెప్పాడు. క్రీజ్‌లోకి దిగిన ప్రతీసారీ సెంచరీ చేయలేమని వారికి వివరించే ప్రయత్నం చేస్తానని, వినిపించుకోరని.. టార్చర్ పెడతారని డేవిడ్ వార్నర్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
ఇక వార్నర్ అండ్ ఫ్యామిలీ తెలుగు హీరోల పాటలకు డ్యాన్స్ చేస్తూ మనకు మరింత చేరువయ్యాడు. అయితే 2021 సీజన్ తో వార్నర్, సన్ రైజర్స్ అనుబంధానికి తెర పడింది. పూర్ ఫామ్ అంటూ వార్నర్ నుంచి కెప్టెన్సీని లాగేసుకున్న సన్ రైజర్స్ అనంతరం అతడిని బెంచ్ కే పరిమితం చేసింది. వార్నర్ తో కూల్ డ్రింక్స్ కూడా మోయించింది. ఫలితంగా వార్నర్ అవమానకరరీతిలో హైదరాబాద్ జట్టును వీడాల్సి వచ్చింది.