ఇక టీ20 (అన్నీ కలిపి) కెప్టెన్ గా ధోనీకిది 302వ మ్యాచ్. ఇప్పటిదాకా సారథిగా ధోనీ 5,994 రన్స్ చేశాడు. 6 వేల పరుగుల మైలురాయికి మరో 6 పరుగుల దూరంలో నిలిచాడు. ఇవాళ ఆ మార్కును అధిగమిస్తే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ధోనీ తన పేరును లిఖించుకోనున్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ 6,451 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక, ఈ ఏడాది ఐపీఎల్ లో కెప్టెన్ గా తప్పుకొంటున్నానని చెప్పి షాకిచ్చాడు ధోనీ. జడేజా పగ్గాలు అందుకోవడం.. అపజయాల బాటలో జట్టు నడవడం కలవరపరచింది. దీంతో మళ్లీ అతడు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తన మార్కు కెప్టెన్సీని ప్రత్యర్థులకు రుచి చూపించాడు. అదే ఊపును కొనసాగించి ఈ మ్యాచులో కూడా తన జట్టును విజయంవైపు నడిపించాలని ధోని భావిస్తున్నాడు.