ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇంతలా విఫలమవ్వడానికి మూల కారణం ఆ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. వీరిద్దరు కలిసి సరైన ఆరంభాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు రాణిస్తున్నా.. ఓపెనింగ్, ఫినిషింగ్ సరిగ్గా లేక సులభమైన లక్ష్యాలను కూడా ఛేదించలేకపోతున్నారు.