పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రోహిత్ శర్మ, ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టిక, ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ 2022 పర్పుల్ క్యాప్" width="1600" height="1600" /> ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లో అయితే ఇషాన్ కిషన్ ను ప్రత్యర్థి బౌలర్లు ఒక ఆట ఆడుకున్నాడు. బౌన్సర్లు వేస్తూ హడలెత్తించారు. ఒక బంతి ఇషాన్ కిషన్ ఎడమ భుజానికి తగలడంతో కాసేపు విలవిల్లాడాడు. ఆ తర్వాత చమీరా వేసిన మరో బంతి ఇషాన్ కిషన్ హెల్మంట్ కు తిగిలింది. దాంతో అతడు బ్యాటింగ్ లో ఉన్నంత సేపు భయపడుతూనే బ్యాటింగ్ చేసినట్లు కనిపించాడు. ఆ తర్వాత అతడి బాడీ మీదకు బంతులు వేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. చివరకు బిష్ణోయ్ బౌలింగ్ లో ఎవరూ ఊహించని రీతిలో అవుట్ అయ్యి పెవిలియన్ కు చేరుకున్నాడు.(PC : IPL Twitter)
తాజాగా ఇషాన్ కిషన్ ఆటపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ’షార్ట్ పిచ్ బంతులకు ఇషాన్ కిషన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇషాన్ కిషన్ వీక్ నెస్ ను బౌలర్లు కనిపెట్టేసినట్లు ఉన్నారు. బాడీ మీదకు వేసే బంతులను ఆడటంతో కిషన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలానే జరిగితే అతడిని చిన్నపిల్లలు కూడా భయపెడతారు‘ అంటూ గావస్కర్ వ్యాఖ్యానించాడు.