ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరోసారి ఆపద్బాంధవుడిలా ధోని మారాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో రెచ్చిపోయిన ధోని.. చాలా గ్యాప్ తర్వాత మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ లో తన ఘనమైన రికార్డును కొనసాగిస్తూనే ఉన్నాడు. ( IPL Twitter)
2016లోనూ మహేంద్ర సింగ్ ధోని ఇటువంటి ప్రదర్శననే కనబరిచాడు. అప్పుడు ధోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఇటువంటి ప్రదర్శనే చేశాడు. నాడు కూడా చివరి నాలుగు బంతుల్లో పుణే విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి. తొలి రెండు బంతుల్లో నాలుగు పరుగులు రాగా... ఆ తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఐపీఎల్ లో 2 బంతులకు 12 పరుగులు రావాల్సిన తరుణంలో రెండు బంతులను కూడా సిక్సర్లుగా బాది జట్టుకు విజయాన్ని అందించిన తొలి ప్లేయర్ ధోనియే కావడం విశేషం. ఈ సీజన్ లో లక్నో జట్టు ప్లేయర్ రాహుల్ తెవాటియా పంజాబ్ కింగ్స్ పై ఆఖరి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టి.. ధోని తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.