IPL 2022 CSK VS LSG LIVE SCORE UPDATES MS DHONI JOINS INTO 7000 RUNS CLUB IN T20IS ALONG WITH VIRAT KOHLI AND ROHIT SHARMA SRD
MS Dhoni Massive Record : అట్లుంటది మరి ధోనితోని.. లేటు వయసులో అరుదైన రికార్డు మహీ సొంతం..
MS Dhoni Massive Record : వయసు అయిపోయిందన్నారు.. జిడ్డు బ్యాటింగ్ తో నరకం చూపిస్తున్నాడన్నారు.. ఇక, ఆడటం అవసరమా అని ట్రోల్ చేశారు. వీటన్నటికీ తనదైన స్టైల్ లో సమాధానమిస్తున్నాడు మహేంద్రుడు.
వయసు అయిపోయిందన్నారు.. జిడ్డు బ్యాటింగ్ తో నరకం చూపిస్తున్నాడన్నారు.. ఇక, ఆడటం అవసరమా అని ట్రోల్ చేశారు. వీటన్నటికీ తనదైన స్టైల్ లో సమాధానమిస్తున్నాడు మహేంద్రుడు. లేటు వయసులో అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
2/ 6
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 7 వేల పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో లక్నో మ్యాచ్ కు ముందువరకు ధోని 6,985 పరుగులు చేశాడు.
3/ 6
లక్నోపై 6 బంతుల్లోనే 16 పరుగులు చేసిన ధోని 7 వేల పరుగుల క్లబులో చేరిపోయాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1617 పరుగులు చేసిన ధోని, ఐపీఎల్లో 4,812 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ లీగ్ వంటి ఇతర టీ20 లీగ్‌ల్లోనూ కొన్ని పరుగులు చేశాడు.
4/ 6
అయితే, ధోని కంటే ముందు ఆ ఫార్మాట్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాబిన్ ఊతప్ప ఉన్నారు.
5/ 6
అయితే, ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 10,326 పరుగులు, రోహిత్ శర్మ 9,936, శిఖర్ ధవన్ 8,818, రాబిన్ ఊతప్ప 7,120 పరుగులు చేశారు.
6/ 6
అయితే, చెన్నైసూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్‌లో ఓడినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో, ఐపీఎల్లో అతి పెద్ద వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఎమ్మెస్ ధోనీ.