క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా చూస్తున్న సమయం రానే వచ్చింది. క్రికెట్ కుంభమేళా ఐపీఎల్ 2022 (IPL 2022)కి కౌంట్ డౌన్ షూరు అయింది. మరో కొద్ది గంటల్లో క్రికెట్ పండగ ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఫస్ట్ ధమాకాలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సారధ్యం వహిస్తున్నచెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), శ్రేయాస్ అయ్యర్ (Shreya Iyer) కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తలబడబోతున్నాయి. అయితే, రెండు జట్లలో క్షణాల్లో ఆట స్వరూపాన్నే మార్చగల ప్లేయర్లు ఉన్నారు.
చెన్నై జట్టుకు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలి సారి నాయకత్వం వహించనున్నాడు. ప్రతి ఏడాదిలానే.. ఈ సారి కూడా జడ్డూపై ప్రత్యేక అంచనాలున్నాయ్. బంతితోనే కాదు బ్యాట్‌తోనూ అద్భుతాలు చేయగల సత్తా జడేజాకు ఉంది. గతంలో కూడా తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. జడేజా ఈ లీగ్‌లో 200 మ్యాచ్‌లు ఆడి మొత్తం 2386 పరుగులు చేశాడు. అలాగే, 127 వికెట్లు కూడా తీశాడు. (CSK Instagram)
శ్రేయాస్ అయ్యర్ మరోసారి కెప్టెన్ పాత్రలో మెరవనున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు తొలిసారి నాయకత్వం వహించనున్నాడు. క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా సత్తా చాటిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ తో మెరుగ్గా రాణించడమే కాకుండా కెప్టెన్‌గా కూడా ప్రభావం చూపుతాడని అతనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక టీ20 లీగ్‌లో అయ్యర్ మొత్తం 87 మ్యాచ్‌లు ఆడి 123.95 స్ట్రైక్ రేట్‌తో 2375 పరుగులు చేశాడు.ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. అత్యుత్తమ స్కోరు 96 పరుగులు. గత సీజన్లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
ఆండ్రీ రస్సెల్ క్షణాల్లో ఆటను మార్చగల మోస్ట్ డేంజరస్ ప్లేయర్. బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేయగలడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో రస్సెల్ పవర్ ఫుల్ హిట్టింగ్ తో ప్రత్యర్ధి బౌలర్లకు నిద్రలేకుండా చేయగలడు. అయితే, ఫిట్ నెస్ ఒక్కటే రస్సెల్ సమస్య. ఒకవేళ సీజన్ మొత్తం ఫిట్ గా ఉండితే.. కేకేఆర్ జట్టుకు తురుపుముక్కగా మారగలడు. రస్సెల్ ఇప్పటివరకు 84 మ్యాచులాడగా.. 178 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 1700 పరుగులు చేశాడు. దీంతో పాటు 72 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. టాపార్డర్ లో కీ ప్లేయర్. అంతేకాకుండా గత సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. ధోనీ లాంటి దిగ్గజం కెప్టెన్సీలో ఆడాడు. ఐపీఎల్లో గైక్వాడ్‌కి ఇది నాలుగో సీజన్. అయితే 2019 వరకు అతనికి ఛాన్స్ దక్కలేదు. గత సీజన్లో ఆడిన 16 మ్యాచుల్లో 1 సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 635 పరుగులు చేశాడు. (AFP)
వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఆల్ రౌండర్ గా కీ రోల్ ప్లే చేయగలడు. వెస్టిండీస్‌తో కోల్‌కతాలో ఆడిన టీ20 మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టి 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేసి 3 వికెట్లు కూడా తీశాడు. ఓపెనింగ్ అయినా, ఫినిషర్ రోల్ అయినా సమర్ధవంతంగా పోషించగలడు. (AFP)