కెప్టెన్ గా జడేజా తప్పుకునే సమయానికి చెన్నై జట్టు 8 మ్యాచ్ ల్లో 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ధోని కెప్టెన్ గా తిరిగి బాధ్యతలు చేపట్టే సమయానికి చెన్నైకి ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని హర్భజన్ పేర్కొన్నాడు. కానీ, ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా చెన్నై జట్టుకు ఎటువంటి సానుకూల ఫలితాలు రాలేదని తెలిపాడు.