తొలుత ఓటములతో ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow super gaints), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలతో దూసుకెళ్తోంటే.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పరాజయాలతో డీలా పడిపోతుంది. తొలుత నాలుగు మ్యాచ్ ల్లో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై అద్భుత విజయాన్ని అందుకుంది.
[caption id="attachment_1273126" align="alignnone" width="1789"] న్యూజిలాండ్ కు చెందిన ఆడమ్ మిల్నే.. కేకేఆర్ తో జరిగిన ఆరంభ మ్యాచ్ లో తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. అయితే తొలుత దీని తీవ్రత తక్కువే అన్నట్లు చెన్నై భావించింది. అయితే సీజన్ సగానికి చేరుకున్నా అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అంతేకాకుండా అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. (PC: TWITTER)
దాంతో అతడు కూడా ఈ సీజన్ నుంచి అవుటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చెన్నై జట్టుకు ఇది పిడుగు లాంటి వార్తే అవుతుంది. ఎందుకంటే సీజన్ లో చెన్నైను బౌలింగ్ ప్రధాన సమస్యగా ఉంది. ఒక్క బ్రావో మినహా మిగిలిన వారు దారుణంగా విఫలమవుతున్నారు. అయితే మిల్నే అందుబాటులోకి వస్తే చెన్నై బాధలు తప్పుతాయని అంతా భావించారు. అయితే మిల్నే ఇంకా కోలుకోలేదని తెలియడంతో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మరింతగా దిగజారింది.