[caption id="attachment_1240412" align="alignnone" width="1600"] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మరోసారి కరోనా కలకలం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) పిజియో ప్యాట్రిక్ ఫర్హాట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆటగాళ్లలో ఎవరూ కూడా కరోనా బారిన పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
[caption id="attachment_844410" align="alignnone" width="1200"] సోమ, మంగళవారాల్లో టీం సభ్యులందరికి కూడా ఆర్ టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక బుధవారం నాడు పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే తాజాగా కరోనా కేసు బయటపడటంతో ఆ మ్యాచ్ పై సందిగ్ధత నెలకొని ఉంది.
ఏదైనా జట్టులో కోవిడ్ కేసులు వచ్చి మ్యాచ్ ఆడలేని స్థితిలో ఉంటే.. మ్యాచ్ ను వాయిదా వేసే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేతుల్లో ఉంటుంది. ఒకవేళ వారు వాయిదా వేయని పక్షంలో మ్యాచ్ లో కరోనా వల్ల ఆడలేని టీంను ఓడిపోయినట్లు ప్రకటించి ప్రత్యర్థి టీంకు 2 పాయింట్లు కేటాయిస్తారు. (PC: TWITTER)
ఐపీఎల్ లో ఈ కరోనా కేసులు కేవలం ప్యాట్రిక్, మార్ష్ లతో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో కరోనా నాలుగో వేవ్ ఆరంభమైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసేందుకు 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. ఏదీ ఏమైనా.. ఢిల్లీ జట్టులో తేలిన కరోనా పాజిటివ్ కేసులు బీసీసీఐకు ఒక హెచ్చరిక లాంటిది. మరీ బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తేలనుంది. (PC: TWITTER)