ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌కి తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగే ఫైనల్‌తో ఈ సుదీర్ఘ సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. దీంతో అందరి దృష్టి ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌పైకి మళ్లింది. వచ్చే సీజన్లో అదనంగా రెండు కొత్త జట్లు (IPL New Teams) వస్తుండడంతో మెగా వేలం జరగనుంది.
ఐపీఎల్ రెండు కొత్త జట్లను కొనేందుకు భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా ఆసక్తి ఉంది. అయితే కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీలను చేజిక్కించుకోవడానికి భారత్ లోని బడా కార్పొరేట్ సంస్థలే కాదు.. ఏకంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ క్లబ్ గా పేరున్న మాంచెస్టర్ యూనైటెడ్ (Manchester United) కూడా బిడ్ దాఖలు చేసినట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక భారత్ లో కూడా బడా కార్పొరేట్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ మీద కన్నేశారు. ఇదిలాఉండగా ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీకి సంబంధించి మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ జంట రణ్ వీర్-దీపికా పదుకునే (Ranveer singh - Deepika Padukune) లు కూడా కొత్త టీమ్ ను దక్కించుకునే రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియాలోని ఓ ప్రముఖ వ్యాపార దిగ్గజం వెనుకఉండి.. దీపికా రణ్ వీర్ జోడిలతో కొత్త జట్టుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.