హైదరాబాద్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్, కేన్ విలియమ్సన్, సంజూ సామ్సన్" width="1600" height="1600" /> ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో డబుల్ ధమాకాతో ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది సూపర్ శాటర్ డే. ఇక, శనివారం ఫస్ట్ మ్యాచులో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో అమీతుమీ తేల్చుకోనుంది రాయల్స్ (Rajasthan Royals).
రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. సన్‌రైజర్స్‌పై ఆ జట్టు 61 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత 211 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఏ దశలోనూ చేధించేలా కనిపించలేదు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ ఘోరంగా విఫలమవడంతో ఎయిడెన్ మాక్రమ్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ఆ జట్టు 7 వికెట్ట నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది.
అయితే, ముంబైతో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్‌లో గాయపడిన ఆ జట్టు స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నైల్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ముంబైతో శనివారం రాజస్థాన్ రాయల్స్ ఆడనున్న మ్యాచ్‌లో కౌల్టర్‌నైల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.