ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) పెద్ద జట్లకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఐపీఎల్ లో విజయవంతమైన ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) కు ఈ సీజన్ అచ్చిరాలేదు. ఈ మూడు జట్లు ఘోరంగా విఫలమవుతున్నాయ్. ఇక, ఐపీఎల్ టైటిల్ రెండు సార్లు నెగ్గిన కోల్ కతా.. ఫస్ట్ లో అదరగొట్టి.. ఆ తర్వాత తడబడింది.
ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్‌కలమ్ నియామకమయ్యాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ అయిన మెక్‌కలమ్‌ను ఇంగ్లాండ్ జట్టుకు కూడా కోచ్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటనతో ఆ ప్రచారం నిజమైంది. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్దిరోజులుగా మెక్‌కలమ్‌తో జరిపిన సుధీర్ఘ చర్చల అనంతరం..నియామకాన్ని ప్రకటించారు.
ఏడాది కాలంగా ఇంగ్లాండ్ జట్టును పరాజయాలు వెంటాడుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఓడటం.. యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో 4-0 ఘోర పరాజయాన్ని చవిచూడం వల్ల జట్టుతోపాటు బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతకు ముందు భారత్ జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్ టీమ్ ఓడిపోయింది. దీంతో దిద్దు బాటు చర్యలకు దిగింది ఈసీబీ.
అందులో భాగంగానే ఇటీవల జో రూట్‌ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. తాజాగా కొత్త హెడ్‌కోచ్‌ను తీసుకొచ్చింది.జూన్‌లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. మూడు టెస్టుల నిమిత్తం కివీస్.. ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లాండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు.
ఇప్పుడు మెక్ కల్లమ్.. ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా నియామకమైన నేపథ్యంలో.. న్యూజిలాండ్ జట్టు పర్యటన సందర్భంలో సొంత జట్టుకు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టులో టెస్ట్, పరిమిత ఓవర్ల క్రికెట్ లో వేర్వేరు సారథులు ఉంటారు. ఇక, మెక్ కల్లమ్ ఈ బాధ్యతలు తీసుకోవడంతో.. కేకేఆర్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయడం ఖాయం.