IPL 2022 సీజన్ లీగ్ స్టేజ్ ఆఖరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్ రేసులో అందరి కన్నా ముందు నిలిచింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ప్లే ఆఫ్ బెర్త్ ను కైవసం చేసుకుంది హార్ధిక్ సేన. మిగిలిన మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ మెగాటోర్నీ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022) సన్నాహాలు ప్రారంభమవుతాయ్.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి విరాట్ కంటే దారుణంగా ఉంది. రోహిత్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 18 సగటుతో, 125 స్ట్రైక్ రేట్‌తో 218 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ ఐదుసార్లు రెండంకెల స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడమే కాకుండా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
ఇక, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి మద్దతు లభించింది. ‘‘రోహిత్ లేదా విరాట్ ఫామ్ గురించి నేను ఆందోళన చెందడం లేదు. వారు ఎంతో చక్కని ప్లేయర్లు. అంతేకాదు పెద్ద ఆటగాళ్లు కూడా. ప్రపంచ కప్పు చాలా దూరంలో ఉంది. టోర్నమెంట్ ఆరంభానికి ముందే వారు తిరిగి సత్తా చూపించే స్థాయికి చేరుకుంటారు’’ అని ఓ వార్తా సంస్థతో గంగూలీ పేర్కొన్నారు.