బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ (Wicket keeping) అత్యుత్తమంగా రాణించే క్రికెటర్ల కోసం చూస్తున్నాయి. అయితే ఒకప్పటిలా కేవలం కీపింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించే ఆటగాళ్లకు యాజమాన్యాలు ఎరవేస్తున్నాయి. ఆధునిక క్రికెట్లో(Modern Cricket) ఈ రెండింటిలోనూ రాణించేవారికే డిమాండ్ ఎక్కువగా ఉంది.
కానీ మిగతా జట్లలోనే ఈ విషయంలో అనిశ్చితి నెలకొంది. దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ (Ishan kishan), వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్ (KS Bharath) లాంటి దేశీయ మేటీ ఆటగాళ్లు వేలంలో ఉన్నప్పటికీ.. కొంతమంది అంతర్జాతీయ స్టార్లు కూడా వీరితో పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న అంతర్జాతీయ వికెట్ కీపర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.