ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుంటూరు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Rayudu) అరుదైన రికార్డును సాధించాడు. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఆటతీరుతో రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో అద్భుత డైవ్ తో సింగిల్ హ్యాండ్ క్యాచ్ తీసుకున్న అతడు.. తాజాగా మరో మైలురాయిని అందుకున్నాడు.
[caption id="attachment_178882" align="alignnone" width="875"] ఐపీఎల్ లో రాయుడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) జట్లకు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం చెన్నైతోనే కొనసాగుతున్నాడు. అతడి ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 181 మ్యాచ్‌లాడిన రాయుడు 29 సగటుతో 4,044 పరుగులు చేశాడు. ఇందులో 21 అర్ధ సెంచరీలు ఉండగా.. ఒక సెంచరీ ఉంది. అతడి అత్యధిక స్కోర్ 100 పరుగులు కావడం విశేషం. 126 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన రాయుడు ఐపీఎల్ లో 337 ఫోర్లు, 154 సిక్సులు బాదాడు.
ఐపీఎల్ లో 4 వేల పరుగులను పూర్తి చేసి ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ (6,402), శిఖర్ ధావన్ (5,989), రోహిత్ శర్మ (5,725), వార్నర్ (5,580), సురేశ్ రైనా (5,528), ఏబీ డీవిలియర్స్ (5,162), క్రిస్ గేల్ (4,965), రాబిన్ ఉతప్ప (4,919), ధోని (4,838), దినేశ్ కార్తీక్ (4,243), గౌతం గంభీర్ (4,218)లు అంబటి రాయుడు కంటే కూడా ముందున్నారు.