చెన్నైసూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బౌలింగ్లో సీఎస్కేను భారీ స్కోర్ చేయనీయకుండా కట్టడి చేసిన కేకేఆర్..ఆ తర్వాత లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. బ్యాటింగ్లో ధోని, బౌలింగ్లో బ్రావో పోరాడినప్పటికీ సీఎస్కేను ఓటమి నుంచి కాపాడలేకపోయారు.