ఐపీఎల్ 2022 (IPL 2022) లో భాగంగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ (Ahmedabad Franchise)ని కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్‌కు బెట్టింగ్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐపీఎల్లో అహ్మదాబాద్ జట్టు ఎంట్రీపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా సీవీసీ క్యాపిటల్‌కు లైన్‌క్లియర్ అయింది.
అహ్మదాబాద్ జట్టుపై యాజమాన్య హక్కులను రూ. 5,625 కోట్లు వెచ్చించి సీవీసీ క్యాపిటల్ దక్కించుకుంది. అయితే దీనిపై మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'బెట్టింగ్ సంస్థలు కూడా ఐపీఎల్ జట్లను కొనుగోలు చేస్తున్నట్లు ఉంది. ఇదేదో కొత్త నిబంధన అనుకుంటా. పెద్ద బెట్టింగ్ కంపెనీ ఒకటి ఐపీఎల్లో అడుగుపెడుతోందట' అంటూ వ్యాఖ్యానించారు.