విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సుదీర్ఘ కాలం పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగింది. ఈసారి అంటే ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ సారధ్యం లేకుండా ఆర్సీబీ జట్టు ఐపీఎల్ బరిలో దిగుతోంది. ఇప్పటికే మెగా ఆక్షన్ పూర్తి కావడంతో ఆర్సీబీ జట్టు సిద్ధమైంది. హాజెల్‌వుడ్ ,డుప్లెసిస్ వంటి కీలక ఆటగాళ్లను కొత్తగా చేర్చుకుని ఐపీఎల్ 2022 కోసం ఎదురుచూస్తోంది.