[caption id="attachment_1286590" align="alignnone" width="1600"] నెల రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ప్రతి జట్టు కూడా 8కి పైగా మ్యాచ్ లు ఆడేశాయి. మరో రెండు మూడు వారాల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
గుజరాత్ ఆడిన 9 మ్యాచ్ ల్లో ఎనిమిదింటిలో విజయం సాధించి.. కేవలం ఒక దాంట్లో మాత్రమే ఓడిపోయింది. 16 పాయింట్లతో దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇక లక్నో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఏడింటిలో గెలిచి 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ రెండు జట్లు కనీసం ఒక మ్యాచ్ లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్ ఖాయమవుతుంది. అయితే మిగిలిన రెండు స్థానాల కోసం జరిగే పోటీ రసవత్తరంగా మారనుంది.
ముంబై ఇండియన్స్ ఇప్పటికే సీజన్ నుంచి తప్పుకోగా.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఏ విధంగా చూసినా లేదు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ రేసులో 7 జట్లు పోటీలో ఉన్నాయి. వీటిలో రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (PC : MUMBAI INDIANS)
ఇక చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో అధికారికంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడి కేవలం 3 మ్యాచ్ ల్లోనే విజయం సాధించాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ను కూడా గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గుజరాత్, లక్నో కాకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకునే మరో రెండు జట్ల పేర్లు చెప్పడం ఇప్పట్లో కష్టమే. (Photo Credit : IPL Twitter)