ఈ జాబితాలో అందరికంటే ముందుగా ఆస్ట్రేలియా సారథి అరోన్ ఫించ్ (Aaron Finch) ఉన్నాడు. తాజాగా కేకేఆర్ ప్లేయర్ అలెక్స్ హేల్స్ ఐపీఎల్ కు దూరమవ్వడంతో అతడి స్థానాన్ని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి అరోన్ ఫించ్ తో భర్తీ చేసింది. కేకేఆర్ ఫించ్ 9వ టీం. 2010లో తొలిసారి రాజస్తాన్ రాయల్స్ టీమ్ కు ఎంపికైన ఫించ్... అనంతరం డేర్ డెవిల్స్, పుణే వారియర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఎక్కువ శాతం మాత్రం బెంచ్ కే పరిమితమయ్యాడు
[caption id="attachment_745134" align="alignnone" width="924"] యువరాజ్ సింగ్ కూడా తన ఐపీఎల్ కెరీర్ లో ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలుత పంజాబ్ కెప్టెన్ గా... అనంతరం పుణే వారియర్స్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన అతడు. అనంతరం బెంగళూరు, ఢిల్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్, చివరగా ముంబై ఇండియన్స్ జట్లకు ఆడాడు.