ఇక మరో దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ’ఏ బ్యాటర్ అయినా తొలి బంతికే అవుటైనట్లయితే అతడి స్కిల్స్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పడం చాలా కష్టం. కనీసం ఒక 6 బంతులు ఎదుర్కున్నట్లయితే ఆ బ్యాటర్ బ్యాటింగ్ లో లోపాల గురించి వివరించవచ్చు. క్రీజులోకి వచ్చాక విరాట్ కోహ్లీ కొంత ఒత్తిడికి లోనవుతున్నాడు అంతే తప్ప కోహ్లీ బ్యాటింగ్ లో టెక్నికల్ గా అంతా బాగుంది‘ అని గావస్కర్ తెలిపాడు. (ఫైల్ ఫోటో)