ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ లీగ్ స్టేజి ముగిసింది. 70 మ్యాచుల లీగ్ స్టేజీలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయ్. ఇక..ఐపీఎల్ తొలి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరుకు నమోదు కానీ రికార్డు ఇప్పుడు నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది.సీజన్ సిక్స్‌ల సంఖ్య వెయ్యి దాటాయి. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఆ ఘనత ఓ మాన్‌స్టర్‌కి దక్కడం విశేషం. ఆ మాన్స్టర్ ఎవరో కాదు పంజాబ్ విధ్వంసవీరుడు లివింగ్ స్టోన్. రొమారియో షెపర్డ్ పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ బౌలింగ్ చేశాడు. అతని ఓవర్ నాలుగో బంతికి .లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్ కొట్టాడు. ఇది అతనికి మ్యాచ్‌లో నాల్గవ సిక్స్ మరియు IPL 2022లో 1000వ సిక్స్. ఈ సిక్స్ కూడా 97 మీటర్లు. ఆ తర్వాత బంతిని మార్చాల్సి వచ్చింది.
ఐపీఎల్లో ఏదైనా ఒక సీజన్లో వెయ్యి సిక్సర్లు తీయడం ఇదే మొదటిసారి మరియు ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఎందుకంటే ఫైనల్‌తో సహా ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అత్యధికంగా 37 సిక్సర్లు కొట్టాడు. అతని జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇంతకుముందు, 2018 ఐపీఎల్లో అత్యధికంగా 872 సిక్సర్లు కొట్టారు.
జోస్ బట్లర్ లాగే, మరో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ బ్యాట్ కూడా IPL 2022లో దడదడలాడించింది. బట్లర్ (37) తర్వాత ఈ సీజన్లో రెండో స్థానం లివింగ్ స్టోన్ దే. ఈ సీజన్ లో 34 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్లో సిక్సర్లతో పోలిస్తే లివింగ్‌స్టోన్ 29 ఫోర్లు మాత్రమే కొట్టాడు. ఈ సీజన్లో, 117 మీటర్ల పొడవైన సిక్స్ కూడా ఈ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ బ్యాట్ నుండే వచ్చింది.