IPL 2021 TO RESUME WITH MUMBAI INDIANS TAKING ON CSK ON SEPTEMBER 19 HERE IE COMPLETE SCHEDULE SK
IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. షెడ్యూల్ వచ్చేసింది.. ఏ మ్యాచ్ ఎప్పుడు? పూర్తి వివరాలు
IPL 2021: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్.. మళ్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఐపీఎల్ తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబరు 19న నుంచి యూఏఈలో ఐపీఎల్-2021 కొనసాగుతుంది.
కరోనా కారణంగా మే 8న నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్... తిరిగి సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
2/ 6
సెప్టెంబర్ 19న దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అక్టోబరు 8న లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ ఢీకొడుతుంది.
3/ 6
మొదటి క్వాలిఫైయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న దుబాయ్‌లో జరుగుతుంది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు షార్జా వేదికగా అక్టోబరు 11, అక్టోబరు 13న నిర్వహిస్తారు.(IPL)
4/ 6
ఇక ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా అక్టోబరు 15న జరుగుతుంది. మొత్తంగా దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.(PC: Twitter)
5/ 6
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ టాప్‌లో ఉంది. 12 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.(PC: Twitter)