మినీ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధం అవుతున్నాయి. వేలం ప్రక్రియకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. మినీ వేలం రేపు చెన్నై వేదికగా జరగనుంది.292 మంది ఆటగాళ్లను ఫైనల్ చేయగా వారిలో 61 మందికి మాత్రమే జట్లు కొనుగోలు చేయనున్నాయ్. ఏ జట్టులోకి ఏ ఆటగాడు వస్తాడనే దానిపై క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎక్కువ మంది ప్లేయర్స్ ను కలిగి ఉంది. ఇక తమ దగ్గర ఉన్న మొత్తంతో ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొనున్నాయ్ జట్లు. దీంతో స్టార్ ప్లేయర్స్ పై అన్ని ఫ్రాంచైజీల కన్ను పడింది. ముఖ్యంగా ఈ సీజన్లో ఆటగాళ్లపై చేసే ఖర్చు విషయంలో అన్ని జట్లూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో మంచి పేరున్నప్పటికీ, ఐపీఎల్ 2020లో మెరుగైన ప్రదర్శన చేయని ప్లేయర్లను వదిలేసుకున్నాయి.
8 Kings XI Punjab – 7.21 కింగ్స్ ఎలెవన్ పంజాబ్: ఐపీఎల్ 2020 ఎడిషన్‌కు ముందు పంజాబ్ బట్టు యాజమాన్యం గ్లెన్ మాక్స్వెల్, షెల్డన్ కాట్రెల్ వంటి ప్లేయర్లు ఎక్కువ ధర పెట్టి తీసుకుంది. వీరు అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీంతో వీరిద్దరితో పాటు కరుణ్ నాయర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కృష్ణప్ప గౌతమ్ వంటి ఆటగాళ్లను యాజమాన్యం వదులుకుంది. ప్రస్తుతం KXIP జట్టు మిగిలిన ఆటగాళ్లలో టాప్-11లో కె.ఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఉండవచ్చు. గత సీజన్లలో వీరి ఆటతీరును బట్టి చూస్తే పంజాబ్ జట్టు ఎనిమిదో స్థానంలో నిలుస్తోంది.
7 Royal Challengers Bangalore – 7.31 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ యాజమాన్యం ప్రతి సంవత్సరం జట్టులో మార్పులు చేస్తోంది. టీమ్‌లో బ్యాకప్ ప్లేయర్లు ఎక్కువమంది ఉంటారు. ప్రస్తుత సీజన్ కోసం నిర్వహించే వేలానికి ముంది RCB కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే నిలుపుకుంది. మరో ఇద్దరిని ట్రేడ్-ఇన్ ద్వారా తీసుకుంది. ఈ 14 మంది ఆటగాళ్లలో టాప్-11 ప్లేయర్లుగా దేవదత్ పడిక్కల్, జాషువా ఫిలిప్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్ ఉండవచ్చు. గత రెండేళ్లలో వీరందరి ప్రదర్శనను బట్టి చూస్తే ఈ టీమ్‌కు జాబితాలో ఏడవ ర్యాంకు ఇవ్వవచ్చు.
6 Kolkata Knight Riders – 7.60 కోల్‌కతా నైట్ రైడర్స్: గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రదర్శన ఏమంత బాలేదు. అయినా ఈ సంవత్సరం జట్టు నుంచి చాలా తక్కువమందిని మాత్రమే మేనేజ్మెంట్ వదులుకుంది. అలీ ఖాన్, క్రిస్ గ్రీన్, హ్యారీ గార్నీ, టామ్ బాంటన్ వంటి విదేశీ ఆటగాళ్లను యాజమాన్యం జట్టు నుంచి తప్పించింది. వీరిలో తుది జట్టును పెద్దగా ప్రభావితం చేసేవారు ఎవరూ లేరు. ఈ లెక్కన చూస్తే టాప్-11లో రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, శివం మాబీ లేదా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ ఉంటారు. వీరి ప్రదర్శనను బట్టి ప్రస్తుత జట్టుకు జాబితాలో ఆరో ర్యాంక్ ఇవ్వవచ్చు.
5 Rajasthan Royals – 7.84 రాజస్థాన్ రాయల్స్: గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌ను మేనేజ్మెంట్ వదులుకొని, ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. 2021 సీజన్లో యువకెరటం సంజు సామ్సన్ను కెప్టెన్‌గా నియమించారు. కెరీర్లో మొదటిసారి అతడు ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రాబిన్ ఉతప్ప, ఓషనే థామస్, వరుణ్ ఆరోన్, టామ్ కుర్రాన్ వంటి ఆటగాళ్లను కూడా వదులుకున్న నేపథ్యంలో టాప్-11 ప్లేయింగ్ మెంబర్స్‌గా జోస్ బట్లర్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి మిగిలారు. గత రెండు సీజన్లలో ఈ ప్లేయర్ల ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత జట్టుకు ఐదో ర్యాంకింగ్ ఇవ్వవచ్చు.
4 Delhi Capitals – 8.21 ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ టీమ్ కూడా ఈసారి ఎక్కువమంది ప్రధాన ఆటగాళ్లను నిలుపుకుంది. జాసన్ రాయ్, కీమో పాల్, డేనియల్ సామ్స్, మోహిత్ శర్మ, సందీప్ లామిచనేలను యాజమాన్యం వదులుకుంది. గత సీజన్లో ఆడని క్రిస్ వోక్స్‌ను కొనసాగించారు. ప్రస్తుతం దిల్లీకి మిగిలిన ఆటగాళ్ల నుంచి టాప్-11 ప్లేయర్లలో శిఖర్ ధావన్, మార్కస్ స్టెయినిస్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హిట్మెయర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లేదా అమిత్ మిశ్రా, కగ్రిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, ఇశాంత్ శర్మ ఉండే అవకాశం ఉంది. గత రెండు సీజన్లలో వీరి ప్రదర్శనను బట్టి ఢిల్లీ జట్టుకు జాబితాలో నాలుగో స్థానం దక్కే అవకాశం ఉంది.
3 Sunrisers Hyderabad – 8.35 సన్‌రైజర్స్ హైదరాబాద్: 2021 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువమంది ఆటగాళ్లను నిలుపుకుంది. ఫాబియన్ అలెన్, బిల్లీ స్టాన్లేక్ వంటి విదేశీ ఆటగాళ్లను యాజమాన్యం వదులుకుంది. ప్రస్తుతం జట్టులో మిగిలిన ఆటగాళ్లలో టాప్-11 ప్లేయర్లుగా డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టి నటరాజన్ ఉండే అవకాశం ఉంది. గత రెండు సీజన్లలో వీటి ఆటతీరును బట్టి సన్‌రైజర్స్ జట్టుకు జాబితాలో మూడో ర్యాంక్ ఇవ్వవచ్చు.
2 Mumbai Indians – 8.36 ముంబై ఇండియన్స్: ఐపీఎల్ 2021 వేలానికి ముందు లసిత్ మలింగ, మిచెల్ మెక్ క్లెనాఘన్, జేమ్స్ ప్యాటిన్సన్, నాథన్ కౌల్టర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లను యాజమాన్యం వదులుకుంది. ముంబై ఇండియన్స్ మొత్తం పదిమంది ప్రధాన ఆటగాళ్లను నిలుపుకుంది. దీంతో ప్రస్తుతం తుది జట్టులో ఆడే 11మందిలో రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ధావల్ కులకర్ణి, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఉండే అవకాశం ఉంది. వీరి గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే ఐపీఎల్ జట్లలో ముంబై ఇండియన్స్‌కు రెండో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి.
1 Chennai Super Kings – 8.45 చెన్నై సూపర్ కింగ్స్: ఈసారి సురేష్ రైనాను చెన్నై యాజమాన్యం వదులుకుంటుందనే ఊహాగానాలు వినిపించినా, అనూహ్యంగా అతడిని కొనసాగించారు. గత సీజన్లో ఆడిన కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్ వంటి ప్లేయర్లను మేనేజ్మెంట్ వదులుకుంది. ట్రేడ్ ఇన్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి రాబిన్ ఉత్తప్పను తీసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మిగిలిన టాప్-11 ఆటగాళ్లలో డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, తాహిర్ లేదా లుంగీ ఎన్గిడి ఉండవచ్చు. గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆటగాళ్లు ఉన్న టీమ్‌కు జాబితాలో మొదటి ర్యాంక్ ఇవ్వవచ్చు.
సురేష్ రైనా ఉండటంతో చెన్నై చాలా బ్యాల్సెన్ డ్ గా కన్పిస్తోంది. గత సీజన్ లో రాణించకపోయినా.. భారత గడ్డ మీద చెన్నై ఎంత ప్రమాదకార జట్టో అందరికి తెలుసు. రాబిన్ ఊతప్ప ను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయంగానే కన్పిస్తోంది. అయితే, మరో సాలిడ్ ఓపెనర్ అవసరం చెన్నై జట్టుకు ఉంది. దీంతో ఆ దిశగా వేలంలో చెన్నై అడుగులు పడే అవకాశం ఉంది.