IPL 2021 ఇక ముగింపు దశకు చేరుకుంది. మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. ఈ మూడు టాప్ 2 స్థానం కోసం పోటీ పడుతున్నాయి. మరో వైపు మిగిలి ఉన్న ఒకే ఒక్క స్థానం కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఇకపై జరుగబోయే ప్రతీ మ్యాచ్ కీలకంగా మారనున్నది. (PC: IPL)
Delhi Capitals: చెన్నై సూపర్ కింగ్స్‌పై మ్యాచ్ గెలవడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నది. ఢిల్లీకి మరో మ్యాచ్ మిగిలి ఉన్నది. ఆ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ అగ్రస్థానం ఖాయం అవుతుంది. అయితే ఆ మ్యాచ్ ఓడిపోయి చెన్నై మిగిలిన మ్యాచ్, ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే మాత్రం అగ్రస్థానం కోసం పోటీ ఆసక్తికరంగా మారనున్నది. (PC: IPL)
Chennai Super Kings- 13 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా బాగానే ఉన్నది. పంజాబ్‌తో మ్యాచ్ ఒకటి మిగిలి ఉన్నది. చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తు దక్కింది. అయితే మిగిలిన మ్యాచ్ గెలిస్తే రెండు స్థానం కోసం పోటీ పడవచ్చు. అయితే ఆ మ్యాచ్ కూడా ఓడిపోతే చెన్నైకి మూడో స్థానం తప్పదు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు మ్యాచ్‌లు గెలవాలి. లేకపోతే చెన్నైదే రెండో స్థానం అవుతుంది. (PC: IPL)
RCB- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హైదరాబాద్, ఢిల్లీ జట్లతో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రెండింటిలో గెలిస్తే నేరుగా రెండో స్థానం సాధించే అవకాశం ఉన్నది. అలా కాకుండా రెండూ ఓడిపోతే అగ్రస్థానంలో ఢిల్లీ, రెండో స్థానంలో చెన్నై నిలుస్తాయి. బెంగళూరు మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్స్ ఆడాల్సి ఉంటుంది. (PC: IPL)
Kolkata Knoght Riders : కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ప్లే ఆఫ్స్ బెర్త్ దొరికేందుకు మెరగైన ఛాన్స్ ఉన్నది. ప్రస్తుతం 12 పాయింట్లతో పాటు మంచి నెట్రన్ రేట్ కలిగి ఉన్నది. మిగిలిన ఒక్క మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కనుక గెలిస్తే రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పించినట్లే అవుతుంది. అంతే కాకుండా 14 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. (PC: IPL)
Punjab Kings: పంజాబ్‌కు అవకాశాలు దాదాపు శూన్యమే అని చెప్పుకోవచ్చు. మిగిలిన మ్యాచ్‌లలో అన్ని జట్లు ఒక్కో గెలుపు మాత్రమే సాధిస్తే.. అన్నీ 12 పాయింట్లతో నిలుస్తాయి. అలా చూసినా మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ఛాన్స్ ఉంటుంది. ఇకపై కోల్‌కతా తప్ప ఏ జట్టు గెలిచినా భారీ తేడాతోనే విజయాలు సాధించాలి. (PC: IPL)
Rajasthan Royal: రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్నది. మిగిలిన రెండు మ్యాచ్‌లు కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉన్నది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి సమీకరణలు అవసరం లేకుండా 14 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. కోల్‌కతాపై గెలిచి.. ముంబైపై ఓడితే మాత్రం అవకాశాలు ఉండవు. ఎందుకంటే రాజస్థాన్ కంటే కోల్‌కతా రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందున 12 పాయింట్లతో అది ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. (PC: IPL)
Mumbai Indians: ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న ముంబై జట్టుకు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో.. మరొక మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉన్నది. ఈ రెండు మ్యాచ్‌లు ముంబై గెలిచినా 14 పాయింట్లు వస్తాయి. కానీ ముంబై ఇండియన్స్ నెట్రన్ రేట్ చాలా తక్కువగా ఉన్నది. అంటే ముంబై జట్టు రాజస్థాన్, హైదరాబాద్ జట్లపై భారీ తేడాతో గెలిచి కోల్‌కతా రన్‌రేట్ కంటై మెరుగా ఉంటే అప్పుడు ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. (PC: IPL)
Sunrisers Hyderabad- సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు లేవు. కానీ ఆ జట్టు గెలిస్తే రెండు జట్లకు ఇబ్బందిగా మారుతుంది. ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిస్తే ఆ జట్టు రెండో స్థానం కోసం పెట్టుకొని ఆశలు ఆవిరి అవుతాయి. (PC: IPL)