అందరికి షాక్ ఇచ్చేలా మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌ను రాజస్థాన్ వదిలేసింది. 2018 ఐపిఎల్ సీజన్ మధ్య నుండి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆర్ఆర్ గత సంవత్సరం లీగ్ టేబుల్లో దిగువన నిలిచింది. ఏది ఏమైనప్పటికి అతను అతను పిభ్రవరిలో జరిగే మీని ఐపీఎల్ వేలంలో అందుబాటులో ఉంటాడు. తాజా టూర్లో రాణించడం కొత్త పాజీటివ్ అంశం.
తాజాగా భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించిన మాక్స్‌వెల్‌ను పంజాబ్ వదిలేసింది. ఆస్ట్రేలియా జట్టుతో పాటు బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) లో అద్భుతమైన ఘనంకాలు ఉన్నప్పటికీ, ఐపిఎల్‌లో మాత్రం రాణించడానికి చాలా కష్టపడతున్నాడు. హిట్టర్, పార్ట్ టైమ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ రాణించగలిగే సత్తా కలిగిన మాక్స్వెల్ అతని ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది.