1. క్రిస్ గేల్ (Chris Gayle) : ఈ విండీస్ ఆజానుబాహుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. టీ-20 ఫార్మాట్ లో విధ్వంసం సృష్టించడంలో ముందుంటాడు క్రిస్ గేల్. గ్రౌండ్ ఏదైనా సరే..అలవోకగా సిక్సర్లు బాదేస్తుంటాడు. ఐపీఎల్ లో ఈ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్ 349 సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది కూడా క్రిస్ గేల్ ఇలాంటి విధ్వంసం సృష్టిస్తే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు క్రిస్ గేల్.
2. ఏబీ డివిలియర్స్ (AB Devilliers) : టీ-20 ఫార్మాట్ లో మోస్ట్ డేంజరస్ బ్యాట్స్ మన్ ఏబీడీ. ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ క్రీజులో నిలదొక్కుకున్నాడంటే బౌలర్లకు చుక్కలు కన్పించాల్సిందే. గ్రౌండ్ నలువైపులా బౌండరీలు, సిక్సర్లుతో విరుచుకుపడటంలో స్పెషలిస్ట్. డివిలియర్స్ ఐపీఎల్ లో ఇప్పటివరకు 235 సిక్సర్లు బాదాడు. ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి టైటిల్ అందించాలన్న కసితో దిగుతున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.
3. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) : తలైవా.. చెన్నై ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు. ఆ పేరుకు తగ్గట్టుగానే చెన్నైకి టైటిల్స్ అందించడంలో ధోనీ కీ రోల్ ప్లే చేశాడు. ఎన్నో సార్లు ఫినిషర్ గా పాత్ర పోషించి అద్భుత విజయాలు అందించాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్ కు దిగి.. సిక్సర్లతో విరుచుకుపడటంలో దిట్ట. ముఖ్యంగా హెలీకాఫ్టర్ షాట్లతో అలరిస్తుంటాడు. ధోనీ..ఇప్పటి వరకూ ఐపీఎల్ లో 216 సిక్సర్లు కొట్టాడు. గతేడాది చెన్నై ఘోర ప్రదర్శన..ఈ సారి టైటిల్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. ప్రాక్టీస్ సెషన్లలో కూడా ధోనీ సిక్సర్లతో అలరించడం మనం చూశాం. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే బౌలర్లకు తిప్పలు తప్పవు.
4. రోహిత్ శర్మ (Rohit Sharma) : సిక్సర్ల క్లబ్ లో ఈ పేరు లేకపోతే ఆశ్చర్యపోవాలి. హిట్ మ్యాన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా. తన స్టైలిష్ హిట్టింగ్ తో అలవోకగా స్టాండ్స్ లోకి సిక్సులు తరలిస్తుంటాడు. తనదైనా రోజునా ఏ బౌలర్ అయినా సరే.. రోహిత్ బ్యాటింగ్ ముందు తేలిపోవాల్సిందే. ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 213 సిక్సర్లు కొట్టాడు. మరో మూడు సిక్సర్లు బాదితే ధోనీ రికార్డును సమం చేస్తాడు. ముంబైకి ఐదు టైటిళ్ల అందించిన రోహిత్.. ఈ ఏడాది కూడా మరో టోర్నీ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాడు.
5. విరాట్ కోహ్లీ (Virat Kohli) : రికార్డు ఏదైనా సరే.. నేను దిగనంత వరకే అన్నట్లుగా ఉంటుంది కోహ్లీ బ్యాటింగ్. అందుకే కోహ్లీని ఫ్యాన్స్ రికార్డుల రారాజు అని పిలుస్తుంటారు. సింగిల్స్, బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచే కోహ్లీ.. ఐపీఎల్ లో సిక్సర్లు కూడా ఈజీగా బాదేస్తాడు. ఈ క్యాష్ రీచ్ లీగ్ లో ఇప్పటివరకు కోహ్లీ 201 సిక్సర్లు కొట్టాడు. ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీకి.. ఐపీఎల్ టైటిల్ లోటుగా ఉంది. దీంతో ఈ సారైనా కచ్చితంగా టైటిల్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఆ కసికి తోడుగా తన బ్యాట్ కు పనిచెబితే ఆ టైటిల్ కూడా విరాట్ కోహ్లీకి దాసోహమనాల్సిందే.