ఐపీఎల్ 2021 (IPL 2021) మలిదశ సందడి అప్పుడే మొదలైంది. ఇంకా కొద్ది రోజుల్లో ఈ మెగా టోర్నికి తెరలేవనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings News), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) లాంటి జట్లు యూఏఈ (UAE)కి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయ్. మరోవైపు, ఐపీఎల్ ప్రాంచైజీలు తమ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయ్. దీంతో, తమ జట్లలో మార్పులు చేర్పులు చేస్తున్నాయ్.ఐపీఎల్ 2021 సెకండాఫ్ ముంగిట జట్టులో ఏర్పడ్డ ఖాళీలను ఫ్రాంచైజీలు భర్తీ చేస్తున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)... ఐపీఎల్ చరిత్రలో బహుశా ఈ జట్టు చేసినన్ని మార్పులు, మరే ఫ్రాంఛైజీ చేయలేదేమో. ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు భారీగా ధర చెల్లించి ప్లేయర్లను కొనుగోలు చేయడం, నిరాశ పర్చిన ప్లేయర్లను వేలానికి వదిలేయడం జరుగుతూనే ఉన్నాయి... ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 ఆరంభానికి ముందు కూడా జట్టులో మార్పులు చేసింది ఆర్సీబీ. ఇటీవల భారత్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో హసరంగా అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో దూరమైన ఆడమ్ జంపా ప్లేస్ లో హసరంగను జట్టులోకి తీసుకుంది ఆర్సీబీ. ముఖ్యంగా హసరంగా తన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో భారత టీ20 సిరీస్ ఓటమిని శాసించాడు. వరల్డ్ నెంబర్ 2 టీ20 బౌలర్ అయిన అతను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఏడు వికెట్లు తీశాడు.
నాథన్ ఎల్లీస్.. ఈ ఏడాది టీ-20 క్రికెట్ లోకి రాకెట్ లా దూసుకొచ్చిన యువ పేసర్. ఎల్లీస్ టీ-20 అరంగేట్రం సూపరో సూపర్. బంగ్లాదేశ్ పై ఈ ఆస్ట్రేలియా యంగ్ పేసర్ తన తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ యంగ్ డైనమైట్ ను పంజాబ్ కింగ్స్ జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియాకే చెందిన మరో పేసర్ రిలే మెరిడిత్ ప్లేస్ లో ఎల్లీస్ అరంగేట్రం చేయనున్నాడు.
న్యూజిలాండ్ యువ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ కూడా ఐపీఎల్ సెకండాఫ్ లో ఆడడంలేదు. అతని స్థానంలో టిమ్ డేవిడ్‌ని ఆర్సీబీ భర్తీ చేసింది. డేవిడ్ ఆస్ట్రేలియన్ మూలానికి చెందిన ఆటగాడు. కానీ, సింగపూర్ కోసం ఆడుతున్నాడు. అతను సింగపూర్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న మొదటి ఆటగాడు. అతను తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్లో ఈ ఆటగాడు ఎలా ఆడుతాడో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని కోల్‌కతా నైట్‌రైడర్స్ తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు కమిన్స్ దూరం కావడంతో అతని లోటును సౌథీతో భర్తీ చేసింది. గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబైయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడిన సౌథీ.. కోల్‌కతాకు అదనపు బలం అవుతాడని ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ఆశాభావం వ్యక్తంజేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 305 మ్యాచ్‌ల్లో 603 వికెట్లు తీసిన సౌథీ.. కమిన్స్ స్థానాన్ని భర్తీ చేస్తాడన్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లు ఆడిన టిమ్ సౌథీ..8.73 ఎకనామితో 28 వికెట్లు తీశాడు. 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున చివరిసారిగా ఆడాడు.