చెన్నైలో గురువారం జరిగిన ఈ వేలానికి రూ.10.75 కోట్లతో వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముగ్గురు ఆటగాళ్లని మాత్రమే కొనుగోలు చేసింది. వేలంలోకి హైదరాబాద్‌కి చెందిన క్రికెటర్లు వచ్చినా.. సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. దాంతో.. అజహరుద్దీన్ ఘాటుగా స్పందించాడు.మొత్తంగా వేలంలో రూ.3.8 కోట్లని మాత్రమే సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ వెచ్చింది. దీంతో.. రూ. 6.95 కోట్ల పర్స్ మనీ అలానే ఫ్రాంఛైజీ వద్ద మిగిలిపోయింది.
తెలుగు క్రికెటర్ హనుమ విహారి అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. రూ.1 కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన విహారిని ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. అయితే.. కేఎస్ భరత్ (విశాఖ పట్నం), భగత్ వర్మ (హైదరాబాద్), హరిశంకర్ రెడ్డి (కడప) మాత్రం కనీస ధర రూ.20 లక్షలకే అమ్ముడుపోయారు. భరత్‌ని ఆర్సీబీ కొనుగోలు చేయగా.. భగత్, హరిశంకర్‌ని చెన్నై కొనుగోలు చేసింది.
హైదరాబాద్ జట్టు : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), కానే విలియమ్సన్, కానే విలియమ్సన్, జానీ బైర్స్టా (వికెట్ కీపర్), మనీశ్ పాండే, శ్రీవాట్స్ గౌతం (వికెట్ కీపర్), వ్రుద్ధమాన్ సాహా (వికెట్ కీపర్), ప్రియం గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, విరాట్ సింగ్, మిచైల్ మార్ష్, జాసోన్ హోల్డర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థాంపీ