ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) సెకంండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేస్ కోసం SRH మినహా మిగతా జట్లు ప్రయత్నిస్తుండటంతో .. ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా వస్తోంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కు భారీ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2020 మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్ (18) ఇప్పటికే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (16) కూడా ఆ దిశగా వెళుతోంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐదు జట్లు రెండు బెర్తుల కోసం పోటీపడుతున్నాయి.
కరీబియన్ ప్రిమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో ఆడిన క్రిస్ గేల్ అక్కడి నుంచి నేరుగా ఐపీఎల్ 2021 ఆడేందుకు వచ్చాడు. బయో బబుల్ కారణంగా ఐపీఎల్ 14 నుంచి తప్పుకుంటున్నట్లు యూనివర్సల్ బాస్ ప్రకటించాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021కు ముందు తనను తాను మానసికంగా రిఫ్రెష్ చేసుకోవాలని చూస్తున్నానని చెప్పాడు.