ఐదో టెస్ట్ రద్దవ్వడంతో కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కీలక ప్లేయర్ అయిన బెయిర్‌స్టో జట్టుకు దూరమవడంతో SRH ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. బెయిర్‌స్టోతో పాటు పంజాబ్ కింగ్స్ హిట్టర్ డేవిడ్ మలన్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ కూడా ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ ముగ్గురు టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీసులో ఆడిన విషయం తెలిసిందే.