ఇక చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరిగే వేలానికి హాజరయ్యేవారు స్వల్ప క్వారంటైన్లో ఉండాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశించింది. వేలానికి ఫ్రాంచైజీల తరఫున హాజరయ్యే వారికి ఒకరోజు ముందే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, వాటి ఫలితాలు 3-4 గంటల్లో వస్తాయని, అప్పటి వరకు అందరూ క్వారంటైన్ పాటించాలని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.