ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ డెడ్లైన్ నేటితో ముగియడంతో.. టీంల వారీగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ ను ఐపీఎల్ యాజమాన్యం కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించింది.ఓవరాల్గా ఆయా జట్లు రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిద్దామా..
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ ప్లేయర్లు : ఎంఎస్ ధోనీ(కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ, ఆసిఫ్, ఇమ్రాన్ తాహిర్, సాయి కిషోర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి
సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, నటరాజన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమాద్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి, షాబాజ్ నదీమ్, సిద్దార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్