హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

రోహిత్ శర్మకు గాయం... వరల్డ్‌కప్ జట్టు ప్రకటనకు ముందు టీమిండియాకు షాక్...

రోహిత్ శర్మకు గాయం... వరల్డ్‌కప్ జట్టు ప్రకటనకు ముందు టీమిండియాకు షాక్...

ఐపీఎల్ సీజన్‌ ఆరంభంలోను భారత స్టార్ బౌలర్ బుమ్రాకు గాయం అయిన సంగతి తెలిసిందే. ఎలాగోలా గాయం నుంచి త్వరగానే కోలుకుని, బరిలో దిగాడు బుమ్రా. తాజాగా మరో టీమిండియా స్టార్‌కు ‘ఐపీఎల్’ గాయం చేసంది. బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ జట్టుతో తలబడే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తెగ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లో మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. కుడి కాలు కండరాలు పట్టేయడంతో రో‘హిట్ మ్యాన్’ మైదానంలోనే పడుకుండిపోయాడు. తర్వాత ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటికి వెళ్లాడు. రోహిత్ శర్మకు గాయం చాలా పెద్దదే అన్నట్టు సమాచారం. ఏప్రిల్ 15న ప్రపంచకప్ 2019లో పాల్గొనబోయే టీమిండియాను ఏప్రిల్ 15న ప్రకటించబోతోంది బీసీసీఐ. ఇప్పుడు స్టార్ ఓపెనర్‌కు గాయం కావడం భారత జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

Top Stories