ఐపీఎల్ 2019 టోర్నీ వచ్చే ఆదివారం(మార్చి 23) నుంచి ప్రారంభంకానుంది. చెన్నైలో జరగనున్న ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మరోసారి ఐపీఎల్ టైటిల్పై కన్నేసిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.