హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

MI vs CSK క్వాలిఫైయర్ 1: ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ ఢీ... గెలిచి ఫైనల్ చేరేదెవ్వరు?....

MI vs CSK క్వాలిఫైయర్ 1: ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ ఢీ... గెలిచి ఫైనల్ చేరేదెవ్వరు?....

ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ మ్యాచ్‌లు పూర్తి అయిపోగా ఫ్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్ల మధ్య అసలు సిసలు సమరం ప్రారంభం కాబోతోంది. తొలి క్వాలిఫైయర్‌లో చెరో మూడు సార్లు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు జరగబోతోంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై రెండు సార్లు విజయం సాధించి మంచి ఆధిపత్యం కనబర్చింది రోహిత్ టీమ్. క్వాలిఫైయర్ 1లో కూడా అదే జోరు చూపించి, ఫైనల్ చేరాలని భావిస్తోంది ముంబై ఇండియన్స్. మరోవైపు ధోనీ టీమ్ కూడా గ్రూప్ దశలో ఎదురైన ఓటమికి ఫ్లేఆఫ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలబడుతుంది.

Top Stories