ఐపీఎల్ 2019: బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన టాప్ 5 బౌలర్లు వీరే...

ఐపీఎల్ అంటేనే పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం సాగే టోర్నీ. బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటారు బ్యాట్స్‌మెన్. అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బౌలర్ల నుంచి అద్భుత ప్రదర్శన ఆశించడం కాస్త కష్టమే. అయితే బ్యాట్స్‌మెన్ రాజ్యంలో కూడా వారిని కంగారు పెడుతూ, ఇబ్బందులకు గురి చేశారు కొందరు బౌలర్లు. పరుగులు సాధించకుండా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి, కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఐపీఎల్ సీజన్ 12లో ఇప్పటిదాకా అలాంటి అద్భుత ప్రదర్శన చేసిన టాప్ 5 బౌలర్లు వీరే...