RCB vs KKR: తొలి విజయం కోసం విరాట్ సేన తహతహ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఢీ...

భారత జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించిన విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. గత సీజన్‌లో ఘోరంగా ఫెయిలైనా... ఈ సారి కోహ్లీ ఫామ్‌ చూసి బెంగళూరు ఫ్యాన్స్‌ అందరూ ‘ఈ సాల కప్ నమ్‌దే’ అని ఫిక్స్ అయిపోయి, సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. అయితే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా బెంగళూరుకు ఏదీ కలిసిరావడం లేదు. మొదటి మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్‌సీబీ... ముంబై‌తో మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌దాకా పోరాడి ‘నో బాల్’ కాంట్రవర్సీ ద్వారా ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు బెంగళూరుకు గట్టిషాక్‌ను ఇచ్చాయి. ఇలా దెబ్బ మీద దెబ్బ పడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన విరాట్ టీమ్... ఈరోజు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడబోతోంది.