ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు భారత బౌలర్లు ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేయడంలో సఫలం అయ్యారు. జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు తీసి చెలరేగగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీతో అడ్డుగా నిలిచాడు. మొత్తానికి భారత జట్టు ఆదివారం 157 పరుగులు చేయాల్సి ఉన్నది.