సిరాజ్ వేసిన బాల్ లెగ్ స్టంప్ లైన్ పిచ్ ఇన్ అయింది. ఖవాజా అడ్డంగా దొరికిపోయాడు. అయితే సిరాజ్ అప్పీల్‌ను అంపైర్ పట్టించుకోలేదు. నాటౌట్‌గా డిక్లెర్ చేశాడు. అయితే కెప్టెన్ రోహిత్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. రీప్లేలో బంతి లైన్లోనే పిచ్ అయినట్లు.. వికెట్లను తాకినట్లు తేలడంతో టీమిండియా ఆనందంలో మునిగిపోయింది. Image Credits Twitter/mufaddal_vodra
ఓవైపు గ్రౌండ్లో రోహిత్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందరూ సిరాజ్పైకి ఎక్కి మరీ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి మ్యాచ్‌ను చూస్తున్న ద్రవిడ్ కూడా ఆనందం ఆపుకోలేకపోయాడు. ఒకరకంగా ఎగిరి గంతేసినంత పని చేశాడు. అయితే ఎప్పుడూ సైలెంట్‌గానే టీమ్ ప్లేయర్లను ప్రోత్సహించే రాహుల్ ద్రవిడ్ ఇలా ఎంజాయ్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. Image Credits Twitter/AkshatOM10
సిరాజ్ అందించిన సూపర్ స్టార్ట్‌తో సీనియర్ షమీ సైతం తర్వాత ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ వేసిన సూపర్ గుడ్ లెంగ్త్ బాల్‌ను వార్నర్ ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు. డిఫెన్స్ ఆడబోయిన వార్నర్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. Image Credits Twitter/FlashCric