Home » photogallery » sports »

INDIAN YOUNG CRICKETER HANUMA VIHARI AND FASHION DESIGNER PREETI RAJ GET MARRIED IN HANAMKONDA TELANGANA CR

పెళ్లిపీటలెక్కిన క్రికెటర్ హనుమ విహారి... హన్మకొండలో ఘనంగా పెళ్లి వేడుక...

భారత జట్టులో తెలుగువారికి స్థానం దక్కడమే చాలా అరుదు. అయితే ఆరంగ్రేటం మ్యాచ్‌లో సత్తా చాటి, టాలెంటెడ్ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు తేజం హనుమ విహారి. 2018 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు కుర్రాడు... మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో తన టాలెంట్ నిరూపించుకున్నాడు విహారి. స్టార్ క్రికెటర్లు ఫెయిలైన చోట విహారి చేసిన అర్ధశతకం... క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రీతిరాజ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హనుమ విహారి... మే 19న హన్మకొండలో ఘనంగా వివాహం చేసుకున్నాడు.