Mithali Raj : ఆ విషయంలో మిథాలీ రాజ్ తర్వాతే ధోనీ, విరాట్ కోహ్లీ..ఆ అరుదైన రికార్డు ఏంటంటే..

Mithali Raj : సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకుంది. మహిళల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ నిలిచింది.