మొత్తంగా మహిళల క్రికెట్లో ఇది రెండో డే/నైట్ టెస్టు కావడం విశేషం. 2017లో సిడ్నీలో ఆసీస్, ఇంగ్లాండ్ తొలి గులాబి టెస్టు ఆడాయి. టీమిండియా చివరి సారిగా 2006లో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఇక మొత్తంగా ఆసీస్, భారత్ తొమ్మిది టెస్టులు ఆడగా కంగారూలు నాలుగు మ్యాచుల్లో గెలిచారు. ఐదు మ్యాచులు డ్రా అయ్యాయి.
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూన్ 16-19 వరకు బ్రిస్టల్‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 27న బ్రిస్టల్ మొదటి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండవ వన్డే (డే-నైట్) జూన్ 30న టౌంటన్‌లో జరుగుతుంది. ఇక చివరిదైన మూడవ వన్డే జూన్ 3న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ జూలై 9న నార్తాంట్స్‌లో, రెండో టీ20 జూలై 11 హోవ్‌లో, మూడో టీ20 జూలై 15న చెల్మ్స్ ఫోర్డ్లో షెడ్యూల్ అయి ఉన్నాయి.
మరోవైపు టీమిండియా పురుషుల మరియు మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కలిసి త్వరలోనే ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటన కోసం కోహ్లీసేన, మిథాలీ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. కరోనా ఎఫెక్ట్ తో పురుషులు, మహిళల క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే చార్టర్డ్ విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.