నైకీ అంతటి సంస్థే స్మృతి దగ్గరికి వచ్చింది. సాధారణంగా స్మృతి ఏ బ్రాండ్‌కు ప్రచారం ఇవ్వాలన్నా ఏడాదికి కనీసం 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటారని టాక్. ఆ లెక్కన నైకీ ఆమెకు రెట్టింపే ఇవ్వొచ్చు. స్టార్డమ్ నెట్‌వర్త్ డాట్ కామ్ అంచనా ప్రకారం చిన్న వయసులోనే అమిత సంపన్నురాలైన మహిళా క్రికెట్ ప్లేయర్ 25 ఏళ్ల స్మృతీ మంధాన. (Image Credit : Instagram)
వుమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్నందుకు మరికొంత మొత్తం లభిస్తుంది. క్రికెటర్‌గా వచ్చే ఈ రాబడి కాకుండా.. మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సంగ్లీలో "ఎస్.ఎం.18" అని ఆమె ఒక కేఫ్ నడుపుతున్నారు. స్మృతి తలపైకి లాభాల గంపను ఎత్తుతున్న ఆమె తొలి వెంచర్ అది. ఎయిర్ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్ బుల్, హీరో మోటార్స్.. వీటినుంచి వచ్చే ప్రచార ధనం ఎటూ ఉంది. (Image Credit : Instagram)
ఇక, స్మృతికి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంటే క్రష్. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే తెగ ఇష్టమని స్మృతి చెబుతోంది. ఆయన సినిమాలు తెగ చూసేస్తుంట. చిన్నప్పుడు హృతిక్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఆయనకు అప్పటికే పెళ్లైంది అని ముసి ముసిగా నవ్వుతూ చెబుతోంది స్మృతి.(Image Credit : Instagram)